పాలకొల్లు లో మారని పరిస్థితి

0చూసినవారు
పాలకొల్లులోని గీతా థియేటర్, ప్రభుత్వాసుపత్రి ప్రాంతాల్లోని బంకుల వద్ద డీజిల్, పెట్రోల్ కోసం వాహనదారులు బారులు తీరారు. ఆటో కార్మికులు డీజిల్ కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఇంధన కొరత లేదని అధికారులు చెబుతున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉందని వాహనదారులు తెలిపారు.