వందే భారత్ రైలును పాలకొల్లులో ఆపాలి

13చూసినవారు
వందే భారత్ రైలును పాలకొల్లులో ఆపాలి
ఈ నెల 15 నుంచి నర్సాపురం–చెన్నై మధ్య ప్రారంభమయ్యే వందే భారత్ రైలును పాలకొల్లులో కూడా ఆపాలని తూర్పుగోదావరి జిల్లా ప్రజలు కోరుతున్నారు. ఈ రైలు నర్సాపురం, భీమవరం టౌన్, గుడివాడల్లో మాత్రమే ఆగుతుందని ప్రకటించారు. అయితే వ్యాపార కేంద్రంగా ఉన్న పాలకొల్లులోనే ఎక్కువ మంది ప్రయాణికులు ఎక్కుతారని, చించినాడ బ్రిడ్జి ద్వారా తూర్పుగోదావరి నుంచి కూడా ప్రయాణికులు ఎక్కువగా వ్యాపారాల నిమిత్తం పాలకొల్లుకే వస్తారని ప్రజలు తెలిపారు. అందువల్ల పాలకొల్లులో తప్పనిసరిగా హాల్టు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్