రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళ మృతి

0చూసినవారు
రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళ మృతి
కోనసీమ జిల్లా రాజవరం–పొదలాడ ఆర్ అండ్ బి రాష్ట్ర రహదారిపై నాగుల్లంక వద్ద గత నెల 25న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన పశ్చిమగోదావరి జిల్లా దొడ్డిపట్ల శివారు పెదలంక గ్రామంకు చెందిన నాట్ర కృష్ణకుమారి (55) అనే మహిళ మంగళవారం మృతి చెందారు. ప్రయాణికుల ఆటోను టిప్పర్ ఢీకొన్న ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న మరణించినట్లు అక్కడి పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన రోజే మల్లాడి పద్మావతి అక్కడికక్కడే మృతి చెందగా, తాజాగా కృష్ణకుమారి మరణంతో మృతుల సంఖ్య రెండుకు చేరింది.
Job Suitcase

Jobs near you