
నకిలీ పోలీస్ అవతారం ఎత్తిన యువతి
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన సుజన నకిలీ పోలీస్ అవతారం ఎత్తి కోనసీమ జిల్లా అమలాపురం పోలీసులకు అడ్డంగా దొరికింది. అక్కడ నివసిస్తున్న శ్రీలక్ష్మిని బెదిరించిన ఘటనలో శుక్రవారం అమలాపురం టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గల్ఫ్ వెళ్లి వచ్చిన శ్రీలక్ష్మి సొమ్ముపై తండ్రి సత్యనారాయణ కన్నేయడంతో సుజనను ఆశ్రయించాడు. పోలీసు అవతారంలో శ్రీలక్ష్మిని బెదిరించడంతో ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.








































