
ప.గో జిల్లా జేసీ హెచ్చరిక
మంగళవారం జేసీ ఛాంబర్లో జరిగిన సమీక్షలో, మండల వ్యవసాయ శాఖ అధికారులు మరియు రిటైల్ డీలర్లను ఉద్దేశించి జేసీ రాహుల్ మాట్లాడుతూ, యూరియా కొనుగోలు విషయంలో రైతులను ఇబ్బంది పెడితే కేసులు తప్పవని హెచ్చరించారు. డీలర్లు యూరియాతో పాటు జింక్, గుళికలు కొనాలని రైతులను బలవంతం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతులు యూరియా కొనుగోలులో ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటే, కంట్రోల్ రూమ్ నంబర్ 83310 56742కు తెలియజేయాలని సూచించారు.







































