విజయవాడలో అంగన్‌వాడీల అక్రమ అరెస్టులను నిరసిస్తూ మంగళవారం బుట్టాయిగూడెంలో CITU, IFTU ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అరెస్టయిన వారిని తక్షణమే విడుదల చేయాలని, కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని వారు హెచ్చరించారు.