బుట్టాయిగూడెం మండలం రెడ్డి గణపవరం శివారులోని కాలువ మంగళవారం ఉదృతంగా ప్రవహిస్తోంది. గత రెండు రోజులుగా ఏజెన్సీలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండ వాగులు పొంగిపొర్లుతున్నాయి. దీనితో కాలువ కాజ్ వే పైనుంచి వరద నీరు ప్రవహిస్తూ వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. ప్రజలు, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.