బుట్టాయగూడెం: పంటలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే

1421చూసినవారు
బుట్టాయగూడెం: పంటలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే
బుట్టాయగూడెం మండలం నూతిరామన్నపాలెంలో బుధవారం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పర్యటించారు. తుఫాను తీరం దాటే క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని సూచించారు. తుఫాను ప్రభావంతో నేలరాలిన పంటలను పరిశీలించి, నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్