ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, ఆయన సతీమణి ఆదివారం తెలంగాణలోని మేడారంలో శ్రీ సమ్మక్క సారలమ్మను దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు, బోనాలు సమర్పించి, రాష్ట్ర ప్రజలు, నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.