కొయ్యలగూడెం మండలంలో బుధవారం వైసీపీ శ్రేణులు రైతులకు మద్దతుగా ఆందోళన నిర్వహించాయి. పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఈ కార్యక్రమంలో పాల్గొని, మొక్కజొన్న రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం మొక్కజొన్నకు మద్దతు ధర ప్రకటించడంలో విఫలమైందని, తక్షణమే మద్దతు ధర ప్రకటించి రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.