కొయ్యలగూడెం: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి

7చూసినవారు
కొయ్యలగూడెం మండలం కన్నాపురంలో బుధవారం CPI ML న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్ ధరలను తగ్గించాలని మెయిన్ సెంటర్ కూడలిలో పార్టీ నాయకులు నిరసన తెలిపారు. ధరల పెరుగుదల వల్ల పేద ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని వారు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్