కొయ్యలగూడెం మండలం బయ్యన్నగూడెం గ్రామానికి చెందిన 8 ఏళ్ల సింగంశెట్టి మణికంఠ అనే బాలుడు తలసేమియా వ్యాధితో బాధపడుతున్నాడు. అతని ఆపరేషన్ కు వైద్యులు 22 లక్షలు ఖర్చవుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో, మంగళవారం మండల టీడీపీ అధ్యక్షులు పారేపల్లి రామారావు, ఎమ్మెల్యే చిర్రి బాలరాజు బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ప్రతి ఒక్కరూ ఆ కుటుంబానికి అండగా నిలవాలని సూచించారు.