తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోయే మహానాడు కార్యక్రమ ఏర్పాట్లు పోలవరం నియోజకవర్గంలో ముమ్మరంగా సాగుతున్నాయి. కుక్కునూరు మండలంలో జరుగుతున్న సన్నాహక పనులను నియోజకవర్గ పార్టీ పరిశీలకులు కోళ్ల నాగేశ్వరరావు, ఇంచార్జ్ బొరగం శ్రీనివాసులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల పురోగతిపై స్థానిక ముఖ్య నాయకులతో చర్చించి, ఏర్పాట్లు పక్కాగా పూర్తి చేయాలని సూచించారు.