బుధవారం రాత్రి టి. నరసాపురం మండలం వీరభద్రవరం గ్రామంలో నూతన సంవత్సర వేడుకలను కూటమి నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ బొరంగం శ్రీనివాసులు ముఖ్య అతిథిగా పాల్గొని, కేక్ కటింగ్ చేసి సంబరాలు జరుపుకున్నారు. నూతన సంవత్సరం అందరికీ మంచి జరగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శీలం వెంకటేశ్వరరావుతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.