రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథిని అమరావతి సచివాలయంలో పోలవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ బొరగం శ్రీనివాసులు కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని పలు అభివృద్ధి పనులు, స్థానిక సమస్యలు, ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, గృహ నిర్మాణ పథకాల పురోగతిపై మంత్రికి వివరించి, సుదీర్ఘంగా చర్చించారు.