పోలవరం మండలం గూటాల గ్రామంలో నలుగురు లబ్ధిదారులకు సుమారు రూ. 2 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఏపీ ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు ఆదివారం అందజేశారు. పేద కుటుంబాలకు ఆర్థిక సాయం అందించే అవకాశం కల్పించడం అదృష్టమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మంగినకొండ, పలువురు నాయకులు పాల్గొన్నారు.