పోలవరం: రోడ్డుపై వరద నీరు ప్రయాణికులకు ఇబ్బందులు

6చూసినవారు
పోలవరం: రోడ్డుపై వరద నీరు ప్రయాణికులకు ఇబ్బందులు
తుఫాను ప్రభావంతో ఎగువ ప్రాంతాలలో కురిసిన భారీ వర్షాలకు చెరువులు పొంగి ప్రవహిస్తున్నాయి. టీ. నర్సాపురం మండలం వల్లంపట్ల గ్రామం వద్ద వరద నీరు రోడ్డుపైనే ప్రవహిస్తూ, బొర్రంపాలెం నుంచి అడ్డ రోడ్డుకు వెళ్లే దారిలో భారీగా చేరింది. గుంతల నిండా నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్య పరిష్కారానికి అధికారులు తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :