కూటమి ప్రభుత్వం ప్రకటించిన మెగా డీఎస్సీ నిరుద్యోగులను మోసం చేసేలా ఉందని పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు విమర్శించారు. శుక్రవారం దుద్దుకూరులో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల ముందు 50 వేల పోస్టులతో డీఎస్సీ ఇస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక కేవలం 16 వేల పోస్టులకే పరిమితం చేయడం దారుణమని, నిరుద్యోగులను నమ్మించి మోసం చేశారని మండిపడ్డారు.