చాట్రాయి మండలం పోలవరం గ్రామం కోనేరు రంగారావు కాలనీలోని ఎంపీపీ ఆదర్శ పాఠశాలలో గురువారం మెగా పేరెంట్స్ మీటింగ్ ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న టిడిపి మాజీ మండలాధ్యక్షుడు మరిడి వెంకటేశ్వరరావు (చిట్టిబాబు) తల్లిదండ్రులు పిల్లల చదువుపై శ్రద్ధ చూపాలని, పాఠశాలకు పంపించాలన్నారు. పిల్లల భవిష్యత్తు కోసం పాఠశాల అభివృద్ధిలో తాను ముందుండి సహకరిస్తానని హామీ ఇచ్చారు. పలువురు నాయకులు, టీచర్లు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.