పోలవరం నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన శనివారం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలో నాయకులు, కార్యకర్తల సమన్వయంతో పార్టీని బలోపేతం చేస్తామని, 2029 ఎన్నికల్లో పోలవరం నియోజకవర్గంలో వైసిపి జెండా ఎగరవేస్తామని బాలరాజు అన్నారు.