మంగళవారం రాత్రి టి. నరసాపురం మండలం శ్రీరామవరంలో 20 కుటుంబాలు టీడీపీ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యాయి. మల్లుకుంట సొసైటీ చైర్మన్ శీలం సాయి వినయ్ ఈ కుటుంబాలతో పరిచయ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమం, అభివృద్ధి పట్ల ఆకర్షితులై పార్టీలో చేరుతున్న వారిని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కూడా పాల్గొన్నారు.