ఏలేటిపాడు సొసైటీ అభివృద్ధి అభినందనీయం - ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ

1328చూసినవారు
ఏలేటిపాడు సొసైటీ అభివృద్ధి అభినందనీయం - ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ
పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో, ఏలేటిపాడు సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రైస్ మిల్లులో రూ. కోటి వ్యయంతో నిర్మించిన డ్రయర్ నిర్మాణాన్ని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతుల సహకారంతో ఏలేటిపాడు సొసైటీ రాష్ట్రంలోనే ఉత్తమ సొసైటీగా గుర్తింపు సాధించడం అభినందనీయమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, సొసైటీ అధ్యక్షులు విశ్వేశ్వర రెడ్డి సహకారంతో సొసైటీ దినదినాభివృద్ధి చెందుతోందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ సొసైటీ రైతులకు ఉత్తమ సేవలు అందిస్తోందని తెలిపారు.

సంబంధిత పోస్ట్