వేలేరుపాడు మండలంలో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు సంబంధించిన ₹. 1,000 కోట్ల భూసేకరణ పునరావాసం చెక్కులను మంత్రి నిమ్మల రామానాయుడు శనివారం అందజేశారు. నిర్వాసితులకు నేరుగా ₹. 1,000 కోట్ల పరిహారం బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతుందని, వారికి అన్నివిధాల న్యాయం చేసే బాధ్యత కూటమి ప్రభుత్వానిదని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన నిర్వాసితులతో మాట్లాడారు.