
తాడేపల్లిగూడెం పార్టీ బలోపేతం కోసం ప్రమాణ స్వీకారం
తాడేపల్లిగూడెం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్, APBOCWWB చైర్మన్ వలవల మల్లిఖార్జునరావు ఆధ్వర్యంలో బుధవారం పట్టణ, మండల, క్లస్టర్, యూనిట్, గ్రామ కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీ చైర్మన్ శ్రీ మందలపు రవి పాల్గొన్నారు. పార్టీని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో కార్యకర్తలందరూ ఒకే వేదికపై ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమం పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపింది.






































