చోరీ కేసులో 13 నెలలు జైలు శిక్ష

2చూసినవారు
చోరీ కేసులో 13 నెలలు జైలు శిక్ష
లిఫ్ట్ ఇస్తానని నమ్మించి బోడపాడుకు చెందిన పత్తివాడ లక్ష్మి వద్ద గొలుసును దొంగిలించిన నిందితుడు జొన్నల వెంకటేశ్‌కు 13 నెలల జైలు శిక్ష, రూ. 2వేల జరిమానా విధిస్తూ తాడేపల్లిగూడెం మెజిస్ట్రేట్ లలిత దేవి తీర్పునిచ్చారు. 2017లో జరిగిన ఈ చోరీ కేసులో నిందితుడిపై నేరం రుజువు కావడంతో శిక్ష ఖరారైంది. కేసును సమర్థంగా దర్యాప్తు చేసి నిందితుడికి శిక్ష పడేలా చేశామని ఎస్సై స్వామి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్