ఆటో ని ఢీ కొట్టిన బోలోరో.... నలుగురికి గాయాలు

3చూసినవారు
బుధవారం ఉదయం పెంటపాడు మండలం ప్రత్తిపాడు సాక్షి కార్యాలయం వద్ద జాతీయ రహదారిపై బోలెరో వాహనం, ప్యాసింజర్ ఆటో ఢీకొన్నాయి. ఏలూరు నుంచి రావులపాలెం వెళ్తున్న బోలెరో, తాడేపల్లిగూడెం నుంచి తణుకు వెళ్తున్న ఆటో మలుపు వద్ద ఢీకొనడంతో ఆటోలోని నలుగురు ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పెంటపాడు పోలీసులు కేసు నమోదు చేసి, గాయపడిన వారిని తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్