తాడేపల్లిగూడెం మండల వ్యవసాయ అధికారి నారాయణరావు బుధవారం తన కార్యాలయంలో మాట్లాడుతూ, రబీ ధాన్యం 90వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు 72 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినట్లు తెలిపారు. సివిల్ సప్లయిస్ ద్వారా ధాన్యం కొనుగోలు చేసి 48 గంటల్లోపు రైతుల ఖాతాకు సొమ్ములు జమ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఆర్ఎస్కేలలో ఏదైనా సమస్య వస్తే ఏవో, తహశీల్దార్, కో ఆపరేటివ్ అధికారులను సంప్రదించవచ్చని సూచించారు.