ఏపీ నిట్ లో సైబర్ సెక్యూరిటీ, ఐఎస్‌ఏసీ అవగాహనా

6చూసినవారు
ఏపీ నిట్ లో సైబర్ సెక్యూరిటీ, ఐఎస్‌ఏసీ అవగాహనా
తాడేపల్లిగూడెం స్మార్ట్ రక్షణ వేదికలు, మేధో ఆధారిత రవాణా వ్యవస్థలకు ఇంటిగ్రేటెడ్ సెన్సింగ్ అండ్ కమ్యూనికేషన్స్ సాంకేతికత ఎంతో కీలకంగా మారనుందని యునైటెడ్ స్టేట్స్ దేవ్‌కామ్ ఆర్మి రీసెర్చ్ లాబోరేటరీ సీనియర్ ఫెలో డాక్టర్ కుమార్ విజయ్ మిశ్రా సూచించారు. జాతీయ సాంకేతిక విద్యా సంస్థ ఆంధ్రప్రదేశ్ (ఎన్‌ఐటీ ఆంధ్రప్రదేశ్)లో గురువారం సైబర్ సెక్యూరిటీ మరియు ఇంటిగ్రేటెడ్ సెన్సింగ్ అండ్ కమ్యూనికేషన్స్ (ఐఎస్‌ఏసీ)పై జరిగిన నిపుణుల ఉపన్యాస కార్యక్రమంలో ఆయన ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఎన్‌ఐటీ ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్‌వేర్, వెబ్, నెట్‌వర్క్, టెలికమ్యూనికేషన్ విభాగం, ఐఈఈఈ సిగ్నల్ ప్రాసెసింగ్ సొసైటీ విద్యార్థి విభాగం సహకారంతో నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్