డీజిల్ కొరత ప్రచారం నమ్మొద్దు..కలెక్టర్

పశ్చిమ గోదావరి జిల్లాలో రాబోయే 48 గంటల పాటు విద్యుత్ కోతలు ఉండవని కలెక్టర్ చదలవాడ నాగరాణి స్పష్టం చేశారు. థర్మల్ కేంద్రాల్లో ఉత్పత్తి పునఃప్రారంభం కావడంతో విద్యుత్ సరఫరా సాధారణ స్థితికి చేరుకుందని, డీజిల్ కొరత లేదని తెలిపారు. రైతులు ఆందోళనతో భారీగా డీజిల్ నిల్వ చేసుకోవద్దని, ప్రజలు అపోహలు నమ్మవద్దని, అధికార యంత్రాంగానికి సహకరించాలని ఆమె సూచించారు.
