తాడేపల్లిగూడెం 16వ వార్డులోని శ్రీదేవి పుంత అంగన్వాడి కేంద్రంలో మంగళవారం కిశోర వికాసం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఐసీడీఎస్ సూపర్వైజర్ సీహెచ్ కే. దుర్గాభవాని మాట్లాడుతూ, బాలికలు మంచి, చెడులపై అవగాహన పెంచుకోవాలని, తమపై తమకు నమ్మకం, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి కార్యకర్తలు గాయత్రి, ఈశ్వరి, నవ్యతో పాటు కిశోర బాలికలు పాల్గొన్నారు.