జనసేన అధ్యక్షులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై కొందరు గుంట నక్కలు తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని ఉభయ గోదావరి జిల్లాల
జనసేన వీర మహిళ కోఆర్డినేటర్ కసిరెడ్డి మధులత ఆగ్రహం వ్యక్తం చేశారు. నిమాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, నక్క రజిని అనే మహిళ సోషల్ మీడియాలో డిప్యూటీ సీఎం పై తప్పుడు వ్యాఖ్యలు చేస్తుందని, అలాంటి వారి మాటలను ఎవరూ పట్టించుకోవద్దని తెలిపారు.
జనసేన నాయకులు, కార్యకర్తలు అలాంటి వారిని పట్టించుకోవద్దని పిలుపునిచ్చారు. గుంట నక్కలు అలాగే మాట్లాడతాయని, వాటిని పట్టించుకుంటే
జనసేన పరువు, ప్రతిష్టలు పోతాయని ఆమె పేర్కొన్నారు.