తాడేపల్లిగూడెం 2వ వార్డులో నిర్మించిన గాయత్రి మున్సిపల్ పార్కును శుక్రవారం జిల్లా కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తో కలిసి ప్రారంభించారు. పార్కు నిర్మాణం పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్, శారీరక, మానసిక దారుఢ్యానికి వ్యాయామం అవసరమని, ఇటువంటి పార్కులు మరిన్ని నిర్మాణం జరగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎం. ఏసు బాబు, ప్రత్యేక అధికారి మల్లికార్జునరావు పాల్గొన్నారు.