ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అగ్నిప్రమాదం. 15లక్షలు ఆస్థి నష్టం

1చూసినవారు
నల్లజర్ల మండలం నల్లజర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. ఆస్పత్రి ఆవరణంలోని మెడిసిన్ స్టోర్ లో మంటలు చెలరేగడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. అదృష్టవశాత్తు, సమయానికి ఆసుపత్రిలో రోగులు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో సుమారు 15 లక్షల రూపాయల నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్