ఆకివీడు మండలం దుంపగడప ఉప్పుటేరు గట్టు వద్ద గంజాయి విక్రయిస్తున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 2.6 కిలోల గంజాయి, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మారేడుమిల్లి నుంచి కిలో గంజాయిని రూ. 5 వేలకు కొనుగోలు చేసి, ఆకివీడు పరిసరాల్లో రూ. 10 వేలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. అరెస్ట్ అయిన వారిలో ముగ్గురికి నేర చరిత్ర ఉందని, అరెస్ట్ చేసిన ఐదుగురిపై రౌడీషీట్ ఓపెన్ చేస్తామని పోలీసులు తెలిపారు.