తాడేపల్లిగూడెం మండలం ఆరుగొలను గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా ఇంచార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడుతూ, ప్రభుత్వ పంట కొనుగోలు విధానాలపై వివరాలు తెలియజేశారు. రైతులకు అన్ని విధాల అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు.