ఆటో కార్మికునికి ఎమ్మెల్యే బొలిశెట్టి రూ. 5వేలు ఆర్ధిక సహకారం

23చూసినవారు
ఆటో కార్మికునికి ఎమ్మెల్యే బొలిశెట్టి రూ. 5వేలు ఆర్ధిక సహకారం
తాడేపల్లిగూడెం శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్, ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు మేరకు పి4 కార్యక్రమంలో భాగంగా ప్రతి నెలా ఒక ఆటో కార్మికునికి రూ. 5,000 ఆర్థిక సహాయం అందిస్తున్నారు. మంగళవారం స్థానిక జనసేన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రభాత సెంటర్, దుర్గా ఆటో యూనియన్ సభ్యుడు సత్యనారాయణ అనే ఆటో కార్మికునికి ఈ సహాయం అందజేశారు. ఆపదలో ఉన్న కార్మికులను ఆదుకుంటున్న ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌కు ఆటో యూనియన్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్