తాడేపల్లిగూడెం జనసేన పార్టీ కార్యాలయంలో 40 మంది దివ్యాంగులకు జిల్లా కలెక్టర్ నాగరాణి చేతుల మీదుగా ఒక్కొక్కరికి 3000 రూపాయల చొప్పున సొంత నిధులతో పెన్షన్లు పంపిణీ చేశారు. ప్రభుత్వం నుంచి పెన్షన్లు మంజూరయ్యే వరకు ఈ సహాయం కొనసాగుతుందని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి ఇలాంటి ఎమ్మెల్యే దొరకడం అదృష్టమని కలెక్టర్ నాగరాణి ప్రశంసించారు. ప్రజలకు సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నానని, మరింత మందికి సేవ చేసే భాగ్యం కల్పించాలని దేవుడిని కోరుకుంటున్నానని ఎమ్మెల్యే పేర్కొన్నారు.