ఆంజనేయస్వామి ఆలయంలో దుండగులు చోరీకి పాల్పడి ఆభరణాలు అపహరించుకుపోయిన ఘటనపై శుక్రవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై జి.వాసు తెలిపారు. తుర్పుతాళ్లు గుత్తుల వారిమెరకలో ఉన్న ఆంజనేయస్వామి ఆలయంలో దుండగులు ఈనెల 8న స్వామికి చెందిన సుమారు కిలో బరువుగల వెండి కిరీటం, అభయ హస్తం చోరీ చేశారు. దీనిపై ఆలయ నిర్వాహకుడు గుత్తుల సుబ్బన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.