పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ పాలన ముగిసేవరకు పాదరక్షలు ధరించనని శపథం చేసిన తాడేపల్లిగూడెంకు చెందిన BJP నాయకురాలు భోగిరెడ్డి ఆదిలక్ష్మి బుధవారం తన దీక్షను విరమించారు. గతంలో తాను బెంగాల్‌లో పర్యటించినప్పుడు మహిళలపై అణచివేత, ఆర్జీ కర్ ఆసుపత్రి ఘటనలకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు. మమత ఓటమిపాలవ్వడంతో 21 నెలల తర్వాత తిరిగి పాదరక్షలు ధరించారు.