పది పరీక్ష ఫలితాలలో పెంటపాడు మండలం 84% ఉత్తీర్ణత సాధించడంపై ఎంపీడీఓ పివివిఎస్ రాంప్రసాద్, ఎంఈఓ-1 ఎం. శ్రీనివాస్, ఎంఈఓ-2 టీవీ. రామకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. మండలంలో 15 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, 10 ప్రభుత్వ పాఠశాలలు, 5 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయని తెలిపారు. మీనవల్లూరు జడ్పీహెచ్ స్కూల్ నూరు శాతం ఉత్తీర్ణతతో మండలంలో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. దర్శపర్రు జడ్పీహెచ్ స్కూల్ విద్యార్థినిలు పంతం గాయత్రి (584), గుండుమోగుల కుసుమాంజలి (579), పెంటపాడు పోస్ట్ బేసిక్ స్కూల్ విద్యార్థి బి చరణ్ సాయిరాం (576) లు మండలంలో అత్యధిక మార్కులు సాధించారు.