రాష్ట్రంలో చంద్రబాబు వెన్నుపోటు పాలనకు రెండేళ్లు పూర్తయిన సందర్భంగా వైసిపి పార్టీ ఈనెల 4, 5, 9, 12 తేదీల్లో తాడేపల్లిగూడెం రూరల్, పెంటపాడు మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఇంచార్జ్ వడ్డీ రఘురాం నాయుడు తెలిపారు. బుధవారం తాడేపల్లిగూడెం
వైసీపీ కార్యాలయంలో చంద్రబాబు వెన్నుపోటు ప్రభుత్వానికి రెండేళ్లు పోస్టర్ను ఆవిష్కరించారు. నాయకులు, కార్యకర్తలు పాల్గొని నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆయన కోరారు.