కొత్త రేషన్ కార్డులకు సరైన ధ్రువపత్రాలతో దరఖాస్తులు సమర్పిస్తే 21 రోజుల్లో ధ్రువీకరించబడతాయని తహశీల్దార్ ఎం. సునీల్ కుమార్ తెలిపారు. మంగళవారం తాడేపల్లిగూడెం తహశీల్దార్ కార్యాలయంలో గ్రామ, పట్టణ వీఆర్వోలతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. 15వ తేదీ నుంచి వాట్సాప్ గవర్నెన్స్ అందుబాటులోకి వస్తుందన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.