తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపో నుంచి నవంబర్ 3న ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శనకు ప్రత్యేక బస్సు నడపనున్నట్లు డిపో మేనేజర్ దానమ్మ తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ బస్సు తాడేపల్లిగూడెం నుంచి ర్యాలీ, వాడపల్లి, అయినవిల్లి, ముక్తేశ్వరం, మురమళ్ళ, కుండలేశ్వరం, పలివెల క్షేత్రాలను సందర్శించి తిరిగి తాడేపల్లిగూడెం చేరుకుంటుంది. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.