సిపిఎం పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు చింతకాయల బాబురావు గురువారం రాజమండ్రిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. తాడేపల్లిగూడెం ప్రాంతానికి చెందిన ఆయన పలు ఉద్యమాలలో పాల్గొన్నారు. ఆయన భౌతిక కాయానికి సిపిఎం నేతలు, రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు.