తాడేపల్లిగూడెంలో కర్ణాటకకు చెందిన ఐదుగురు యువకులు తాము అధికారులమని చెప్పుకుంటూ లాడ్జిలపై దాడి చేశారు. రికార్డు పుస్తకాలు తీసుకెళ్తుండగా అనుమానం వచ్చిన బాధితులు పోలీసులకు సమాచారం అందించారు. నకిలీ అధికారులని తేలడంతో లాడ్జీల యాజమాన్యం వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించింది. గురువారం పోలీసులు వారిని అరెస్టు చేసి విచారణ చేపట్టారు. కేసు విచారణ దశలో ఉందని, మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని తెలిపారు.