తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం రైలు పట్టాలు దాటుతుండగా, ఉంగుటూరు మండలం చిన్నవెల్లమిల్లి గ్రామానికి చెందిన రత్నకుమార్(51) అనే వ్యక్తి రైలు ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. ఏలూరు సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం అతను మృతి చెందాడు. ఈ ఘటనపై రైల్వే ఎస్ఐ అప్పారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.