పింఛన్ లబ్ధిదారులను ఆప్యాయంగా పలకరించిన జిల్లా కలెక్టర్

4చూసినవారు
పింఛన్ లబ్ధిదారులను ఆప్యాయంగా పలకరించిన జిల్లా కలెక్టర్
శుక్రవారం తాడేపల్లిగూడెం పట్టణంలోని రెండవ వార్డు వీకర్స్ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ లబ్ధిదారుల ఇంటికి వెళ్లి స్వయంగా పింఛన్ నగదు అందజేశారు. కలెక్టర్ లబ్ధిదారుల ఆరోగ్య, జీవన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. పింఛన్ సమయానికి అందుతోందా, ఎవరైనా డబ్బులు అడుగుతున్నారా అని ఆరా తీశారు.

సంబంధిత పోస్ట్