విద్యుత్తు సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలి

6చూసినవారు
వేసవి వడగాల్పుల నేపథ్యంలో ప్రజలకు విద్యుత్తు సరఫరాలో అంతరాయం లేకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని, విద్యుత్తు సమస్యలపై తక్షణమే స్పందించి పరిష్కరించాలని శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ విద్యుత్తు శాఖ అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే కార్యాలయం లో శుక్రవారం విద్యుత్తు శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వేసవి తీవ్రత నుంచి ప్రజలకు ఉపశమనం కలిగే విధంగా విద్యుత్ అధికారుల పనితీరు ఉండాలని, ఏ ఫిర్యాదు వచ్చినా వెంటనే స్పందించి విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్