నవాబ్ పాలెం రైల్వే ట్రాక్ పై గుర్తు తెలియని మృతదేహం

12చూసినవారు
నవాబ్ పాలెం రైల్వే ట్రాక్ పై గుర్తు తెలియని మృతదేహం
తాడేపల్లిగూడెం-నవాబ్ పాలెం రైల్వే ట్రాక్‌పై సోమవారం ఉదయం ఏడు గంటల సమయంలో గుర్తుతెలియని యువకుడి మృతదేహాన్ని ట్రాక్ మాన్ గుర్తించి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే ఎస్సై అప్పారావు మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి ఒంటిపై గులాబీ రంగు టీ షర్టు, సిమెంట్ రంగు షార్టు, పక్కనే క్రీం కలర్ చెప్పులు, పసుపు రంగు టార్చ్ లైట్ ఉన్నాయని తెలిపారు. మృతుడి వివరాలు తెలియరాలేదని, తెలిసినవారు తాడేపల్లిగూడెం రైల్వే పోలీసులను సంప్రదించాలని కోరారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్