
అత్త వేధింపులతో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య.. భర్త అరెస్ట్
బెంగళూరులోని అబ్బిగెరెలో కుటుంబ కలహాల కారణంగా 35 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ సుష్మ ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుంది. వంట విషయంలో అత్త కల్పనతో గొడవపడి, మనస్తాపానికి గురైన సుష్మ ఉరివేసుకుంది. అదనపు కట్నం కోసం వేధించి, మానసికంగా హింసించి ఆత్మహత్యకు ప్రేరేపించారని సుష్మ కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు సుష్మ భర్త పునీత్ కుమార్ను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితురాలైన అత్త కల్పన పరారీలో ఉంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.




